Thursday, January 19, 2012

కాపుల అణచివేతకు కుట్ర

జనాభాలో 4 శాతం వున్న ఆధిపత్య కులాలు బీసీ వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ బీసీలను రాజకీయంగా అణగదొక్కడానికి కుట్ర చేస్తున్నాయని కాపునాడు ఆంధ్రప్రదేశ్‌ ఛైర్మన్‌ మి ర్యాల వెంకట్రావ్‌ ఆరోపించారు. ఆధిపత్య కులాలు తమ ఉనికిని కాపా డుకోవడం కోసం, ఆర్థిక ఆధిపత్యాన్ని సాధించుకోవడానికి అత్యధికంగా 27 శాతం వున్న బీసీలను, ఇతర కులాలను అణగదొక్కడానికి కుట్రలు, కు యుక్తులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. బుధవారం లోయర్‌ ట్యాం క్‌బండ్‌లోని ఓ హోటల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూపీఏ నేతృత్వంలోని కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తూ కాపులను అణిచివేయాలని కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల పీసీసీ అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టిన బొ త్స సత్యనారాయణను దెబ్బతీయడానికి ముఖ్యమంత్రి పడరాని పాట్లు పడు తున్నారని, అదేవిధంగా చిరంజీవికి కేంద్రంలో మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని వెంకట్రావ్‌ దుయ్యబట్టారు.

గతంలో రాయలసీమ నుం చి కేంద్ర మంత్రి పదవిని చేపట్టిన సాయిప్రతాప్‌ను మంత్రి పదవి నుంచి తొలగించడానికి ఈ ఆధిపత్య కులాలు కుట్ర చేశాయని, వారి ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం కాపు, బలిజలను కాంగ్రెస్‌ పార్టీకి దూరం చేస్తు న్నారని, ఇలాంటి వివక్షతను ప్రదర్శించి కాంగ్రెస్‌ పార్టీని బలహీనపరిస్తే చూస్తూ ఊరుకోమని ఆయన అన్నారు. కాపుల మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా అధికారంలోకి రాదన్న విషయాన్ని ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ గుర్తించుకోవాలని వెంకట్రావ్‌ హితవు పలికారు.

మంత్రులకు శాఖల కేటాయింపులో వివక్షత
ముఖ్యమంత్రి బీసీ కులాలకు చెందిన మంత్రులకు శాఖల కేటాయిం పులోనూ వివక్షతను చూపారని, ఆధిపత్యకులాలకు కీలకశాఖలను కేటా యించి కులహంకారానికి పాల్పడ్డారని, కన్నా లక్ష్మినారాయణ, వట్టి వసం తకుమార్‌, పొన్నాల లక్ష్మయ్యవంటి కాపు మంత్రులకు అప్రధానమైన శాఖలను కేటాయించి తన వర్గానికి ఆర్థిక, హోం శాఖలను కేటాయిం చు కున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి అవలంభిస్తున్న బీసీ వ్యతి రేఖ విధానాలపై ఫిబ్రవరి మొదటి వారంలో ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్‌ పార్టీ అధి ష్టానానికి వినతిపత్రం సమర్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. త్వరలో జరు గబోయే మంత్రివర్గ విస్తరణలో జనాభా ప్రాతిపదికన కాపు కులస్తులకు ఎనిమిది మంత్రి పదవులను ఇవ్వాలని అదేవిధంగా మూడు రాజ్యసభ స్థా నాలు కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో డా వెంకటేశ్వర్‌రావు, చందార్‌రావు, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

No comments: