Thursday, January 19, 2012

కాపులకు గండి!

బీసీ, ఎస్సీలను సమన్వయం చేసుకుని తమ చిరకాల వాంఛితమైన ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలన్న కాపుల కలలు కల్లలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా.. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ప్రాంతంలో అంబేద్కర్‌ విగ్రహాలను కూల్చివేయటంతో ఎస్సీ, బీసీ-కాపుల మధ్య మరింత దూరం పెరిగినట్ట యింది. ఆ ఘటనకు కారకులు ఎవరన్నదీ ఇంకా తేలక పోయినప్పటికీ, కాపుల హస్తమే ఉందని బడుగులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో కాపు లు- బీసీ, ఎస్సీల మధ్య ఆది నుంచి కులవైరం కొన సాగుతున్న విషయం తెలిసిందే. కోస్తాలో కాపులు అగ్ర కులంగానే చెలామణి అవుతున్న విషయం తెలిసిందే.
తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ప్రాంతంలో సోమవారం నాలుగుచోట్ల అంబేద్కర్‌ విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటన వెనుక కాపు సామాజికవర్గం హస్తం ఉందని ఎస్సీ, బీసీ వర్గాలు బాహాటంగానే ఆరోపి స్తున్నాయి. బీసీలు ఉంచిన కొన్ని ఫ్లెక్సీలను కూడా చించి వేశారన్న వార్తలు వెలువడ్డాయి. దీనికి నిరసనగా ఎస్సీ వర్గాలంతా కాపులు డౌన్‌ డౌన్‌ అంటూ బాహాటంగానే నినాదాలు చేశారు. వారికి స్థానికంగా ఉన్న బీసీ వర్గాలు కొన్ని మద్దతుగా నిలిచాయి. తరతరాలుగా కాపులు తమపై దోపిడీ, దౌర్జన్యాలు చేస్తున్నా, ప్రభుత్వాలు కాపు ఓట్లకు భయపడి చర్యలు తీసుకునే ధైర్యం చేయడం లేదని విరుచుకుపడుతున్నారు.

సోమవారం నాటి ఘటనకు కారకులయిన వారిని శిక్షించమని డిమాండ్‌ చేసిన తమపైనే పోలీసులు దౌర్జన్యం చేయడం అన్యాయమని, కాపు ప్రజాప్రతి నిధులు పోలీసులపై ఒత్తిడి చేసి తమ ఆందోళనను అణచివేస్తున్నారని దళిత వర్గాలు ఆరోపిస్తున్నాయి. న్యాయం కోసం వెళితే తమకు అన్యాయం ఎదురయిం దని విరుచుకుపడుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో.. కోస్తాలో బీసీ, ఎస్సీ లను సమన్వయం చేసుకుని ముఖ్యమంత్రి పదవి సాధించాలన్న పట్టుదలతో అడుగులు వేస్తున్న కాపు సా మాజికవర్గ నాయకుల స్పీడుకు బ్రేకులు పడినట్టయింది. నిజానికి కోస్తాలో బీసీ, ఎస్సీలకు కాపులకు సరిపడదు. ఈ వర్గాల మధ్య అనాదిగా శత్రుత్వం కొనసాగుతోంది. అయితే, దశాబ్దాల నుంచి జనాభాలో 8 శాతం కూడా లేని రెడ్డి-కమ్మ వర్గాలే పెత్తనం చేస్తూ, 10 శాతం జనాభా ఉన్న తమకు అన్యా యం చేస్తూ సీఎం సీటు రాకుండా కర్రపెత్తనం చేస్తు న్నాయన్న అసంతృప్తితో కాపు నేతలు రగిలిపోతున్నారు.

ఇప్పుడు తమ సామాజికవర్గానికి చెందిన చిరంజీవి రావ డం, కాపులతో సమన్వయం చేసుకుని వెళుతున్న బొత్స సత్యనారాయణ పీసీసీ చీఫ్‌ కావడంతో కాపులలో ఆశలు చిగురించాయి. బీసీ, ఎస్సీలను సమన్వయం చేసుకుని వెళితేనే కాపులు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలుంటా యని గ్రహించిన కాపు నేతలు, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలోనే బీసీ అయిన బొత్స సత్యనారా యణను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అణచివేస్తున్నా రని కాపునాడు అధ్యక్షుడు మిరియాల వెంకట్రావు ఆరోపించటం తెలిసిందే. బీసీలతో ఏ మాత్రం సంబంధం లేని కాపునాడు హటాత్తుగా బీసీకి చెందిన బొత్సకు అన్యా యం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేయడం వెనుక బీసీలను సమన్వయం చేసుకుని సీఎం పదవి సాధిం చాలన్న ఎత్తుగడ సుస్పష్టమని బీసీ నేతలు వ్యాఖ్యా నించడం గమనర్హం.

అయితే, బీసీలు-కాపులు కలిసే సమస్యే లేదని బీసీ నేతలు కుండబద్దలు కొట్టినట్లు అప్పుడే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన తాజా పరిణామాల నేపథ్యంలో.. కాపు నేతల మంత్రాంగం బెడిసికొట్టి నట్టయిందని బీసీ నేతలు విశ్లేషిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో శెట్టి బలిజ, యా దవ, మత్స్యకారులు ఒక జట్టుగా కాపులు మరొక జట్టుగా నిలు స్తుంటారు. సోమవారం అంబేద్కర్‌ విగ్రహాల విధ్వంసం వెనుక ఎవరున్నదీ ఇంకా స్పష్టం కాకపోయినప్పటికీ, కాపులే కారణమని ఎస్సీ, బీసీలు బాహాటంగా పొలీసు స్టేషన్‌ వద్ద జరిగిన ధర్నాలోనే ఆరోపించారు. దీన్ని బట్టి.. భవిష్యత్తులో బడుగు వర్గాలను సమన్వయం చేసుకుని ముఖ్యమంత్రి పదవి సాధించాలన్న కాపుల వ్యూహం నెర వేరడం కష్టమని ఇప్పటి పరిణామాలు స్పష్టం చేస్తున్నా యని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదిలాఉం డగా.. ఆదివారం జరిగిన సమన్వయ కమిటీ సమావేశం ముందు.. కాపులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, దళితులను విస్మరించడంపై అమలాపురం ఎంపీ హర్షకు మార్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘2009 ఎన్నికల్లో దళితుల మద్దతుతో కాంగ్రెస్‌ పార్టీ అధికారం లోకి వచ్చింది. మా చేతిలో ఓడిన వాళ్లకు మంత్రి పదవులిచ్చి, మా సామాజిక వర్గానికి చెందిన వారిని మంత్రి పదవి నుంచి తొలగిం చారు. ఆజాద్‌ ఉద్దేశపూర్వకంగా మాలలను దూరం పెడు తున్నార’’ని హర్షకుమార్‌ చేసిన వ్యాఖ్యలు కోస్తాలో, ప్రధా నంగా తూర్పు గోదావరి జిల్లాలో ప్రభావితం చేశాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తమ చేతులో ఓడిన పీఆర్పీకి, అది కూడా కాపులకు మంత్రి పదవులు ఇవ్వ డాన్ని ఆయన తప్పుపట్టారు. దాని ఫలితంగానే సోమ వారం నాటి ఘటనలని పోలీసు వర్గాలు అంచనా వేస్తు న్నాయి. హర్షకుమార్‌కు హెచ్చరికగానే కాపులు ఈ విధ్వం సానికి పాల్పడినట్లు ఎస్సీలు కూడా అనుమానిస్తున్నారు.

ఇదిలాఉండగా.. అటు కమ్మ-రెడ్డి వర్గాలు కూడా ఒక్క తాటిపైకి వచ్చి కాపులను ఎదుర్కొనేందుకు సిద్ధమవు తున్నారు. ఆ మేరకు తమ మధ్య ఉన్న వైరాన్ని కూడా పక్కకుపెట్టి, కాపులకు అందలం దక్కకుండా కొత్త వ్యూహా లకు తెరలేపారు. రెడ్డి నేతలు చేసిన వ్యాఖ్యలను కమ్మ వర్గీ యులు సమర్థించడం, కమ్మ నేతలు చేసిన వ్యాఖ్యలకు రెడ్డి వర్గీయులు మద్దతు ప్రకటించడం అందులో భాగం గానే కనిపిస్తోంది. ఇటీవల గాదె వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్య లను గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు సమ ర్థించిన విషయం తెలిసిందే. మొత్తానికి అటు బీసీ- ఎస్సీలు, ఇటు రెడ్డి-కమ్మ వర్గాలు కలసి కాపులను ఎదు ర్కొనేందుకు ఒక్కటవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

No comments: